గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ.
లాంఛనంగా 9జిల్లాలో న్యూట్రిషన్ కిట్లు ప్రారంభం.
ఎమ్మెల్యే రేఖాశ్యామ్ నాయక్.
జనం సాక్షి ఉట్నూర్.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు నుతంగా ప్రవేశపెట్టిన కెసిఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ ఉట్నూర్ సి హెచ్ సి ప్రభుత్వ ఆసుపత్రిలో పి ఓ వరుణ్ రెడ్డి తో కలిసి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కెసిఆర్ రాష్ట్రంలోని స్త్రీ శిశు సంక్షేమానికి పెద్ద పీట వేశారని అన్నారు. హైద్రాబాద్ లో సీఎం కార్యాలయంలో బుధవారం ఉదయం సీఎం కెసిఆర్ ఈ పథకాన్ని లాంఛనం చేశారని అన్నారు. న్యూట్రీషియన్ కిట్స్ ద్వారా గర్భిణీ మహిళకు రక్తహీనత ఎక్కువ కలిగిన మహిళకు లబ్దిచేకురుతుంది అని అన్నారు. గర్భిణీలకు కెసిఆర్ న్యూట్రిషన్ కిట్స్ పుట్టిన పిల్లలు కెసిఆర్ కిట్స్ అందజేసిన ఘనత సీఎం కెసిఆర్ కి దక్కిందని కొనియాడారు. న్యూట్రిషన్ కిట్స్ లో రక్తహీనత తలెత్తకుండా గర్భిణులకు హిమోగ్లోబిన్ ఎక్కువా అవ్వడానికి మంచి మందులు మరియు పోస్టికఆహారం ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎంపీపీ పంద్రా జైవంత్ రావు మార్కెట్ కమీటీ చైర్మన్ శ్రీరామ్ జాధవ్ ఆడిషనల్ డి ఎం హెచ్ ఓ మనోహర్ డెప్యూటీ డి ఎం హెచ్ ఓ విజయ్ హాస్పిటల్ సూపర్ డెంట్ ఉపేందర్ జాధవ్ బి ఆర్ ఎస్ వి జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ మండల అధ్యక్షులు కందుకూరి రమేష్ రాజేష్ అహ్మద్ అజీమోద్దీన్ ప్రజ్ఞాశీల్ గర్భిణీ మహిళలు తదితరులు ఉన్నారు.




