Tuesday, 3 November 2026

గర్భిణులు, శిశువులకు పౌస్టిక ఆహారము అందించడంలో అంగన్వాడిల సేవలు అభినందనీయం

 

 

 

 

 

 

రాజంపేట్ మార్చి 8 (జనంసాక్షి)

రాజంపేట్ మండల పరిధిలోని శివాయిపల్లి గ్రామంలో రెడ్డి కళ్యాణ మండపంలో
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా రాజంపేట్ శాఖ ఆధ్వర్యంలో శివాయిపల్లి రెడ్డి కళ్యాణ మండపంలో గ్రామ ఉప సర్పంచ్, రాజంపేట్ మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు బక్కి సంధ్య అద్యక్యతన మహిళలకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్చార్జ్ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ హైందవ ధర్మంలో మహిళలకు తొలి ప్రాధాన్యత ఉందని, ప్రకృతినీ అమ్మతో పోల్చి కలుస్తామని అన్నారు. తెలంగాణ మహిళలు ఆత్మ స్థైర్యం గలవారు అని, చాకలి ఐలమ్మ, రాణి రుద్రమ్మ, సమ్మక్క – సారలమ్మ, స్ఫూర్తితో తెలంగాణ ఆడబిడ్డలు సాధికారత సాధించాలి కానీ వేదింపులకు భయపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని అన్నారు. కరోనా సమయంలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు.
గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతలు, శిశువులకు పౌస్టిక ఆహారము అందించడంలో అంగన్వాడిల సేవలు అభినందనీయం అన్నారు.
అనంతరం రమణ రెడ్డి మండలం లోని అంగన్వాడీ వర్కర్లను, ఆయలను, ఆశా వర్కర్ల ను, ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజంపేట్ మండల బిజెపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు