పూలపల్లి : గవర్నర్ ప్రసంగం అంతా తప్పుల తడకగా సాగిందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ప్రభుత్వ అవినీతి వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని ఆయన పశ్చిమగోదావరి జిల్లా పూలపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. తాము చేసిన అభివృద్ధి వల్లే హైదరాబాద్‌లో అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ స్టేట్‌గా తయారు చేశామని చెప్పారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అవినీతిమయమైందని ఆరోపించారు. చేనేత రంగాన్ని కాంగ్రెస్ పూర్తిగా నిర్వీర్యం చేసిందని అన్నారు. పావల వడ్డీ పేరుతో రూపాయి వసూలు చేస్తున్నారని రాష్ట్రంలో మహిళలు తిట్టుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు.




