మెట్రో న్యూస్, మంచిర్యాల్: జిల్లాలోని ప్రముఖ బుల్ బుల్ సితార కళాకారుడికి రాజభవన్ కార్యాలయంలో గవర్నర్ తమిళసై చేతుల మీదుగా తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున సన్మానం జరిగింది.మంచిర్యాల్ హైటెక్ సిటీ కాలనీ నివాసి అయిన చుంచు గురువయ్య బుల్ బుల్ సితార వాయిద్యాన్ని విరామం లేకుండా ఏడు గంటలు వాయించినందుకు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు గ్రహీత కు రాజ్ భవన్ లో తనకు సన్మానం జరిగిందని తెలిపారు. అనంతరం గురువయ్య గవర్నర్ కి పూలగుచ్ఛం అందజేసి తమిళసై జన్మదిన సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గవర్నర్ చేతుల మీదుగా చుంచు గురువయ్యకు సన్మానం





