Tuesday, 3 November 2026

బడి ఈడు పిల్లలను మా బడిలో చేర్పించండి!

జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు శనివారం మంచిర్యాల జిల్లా పరిషత్ (బాలుర )ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు జాఫర్ నగర్, రైలే కాలనీ ప్రాంతాల్లో ప్రో. జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తమ పాఠశాల విశేషాలను తెలియజేసే, ప్రచార కరపత్రాలను, బ్యానర్ ప్రదర్శిస్తూ కాలనీల్లో ఇంటింటా తిరుగుతూ తల్లిదండ్రులను, బడి ఈడు పిల్లలను కలిసి ప్రభుత్వ పాఠశాల యొక్క విశిష్టతలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మన ఊరు మనబడి కార్యక్రమంలో ప్రవేశపెడుతున్న నూతన సౌకర్యాలను, డిజిటల్ బోర్డ్స్ ఉచిత నోట్ బుక్స్, ఇతర ఉచిత సౌకర్యాలను ఉపాధ్యాయులు వివరించారు.నూతన ప్రవేశాలకు విద్యార్థుల పేర్లు,తల్లి దండ్రుల చిరునామాలు నమోదు చేసుకున్నారు. తమ పాఠశాలలో చేరాలని ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో డి.వో.ఓ కార్యాలయ కమ్యూనిటీ మొబలైసింగ్ ఆఫీసర్ కె.చౌదరి ఇన్చార్జి, హెచ్.ఎం ఏ.వేణుగోపాల్ , ఉపాధ్యాయుడు గుండేటి యోగేశ్వర్ , రేని రాజయ్య, గోలి మనోహర్, ఏ శ్రీనివాస వర్మ, డి.ఏస్.ఓ మధుబాబు,తల్లిదండ్రులు బడి ఈడు పిల్లలు పాల్గొన్నారు.