Wednesday, 4 November 2026

గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి: సిపిఐ.

గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి: సిపిఐ.

 

– అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన, ధర్నా…

బూర్గుంపహాడ్ డిసెంబర్ 29 (జనంసాక్షి)
సిపిఐ పార్టీ జాతీయ రాష్ట్ర సమితి పిలుపుమేరకు గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని, ఫెడరల్ వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గురువారం బూర్గంపహాడ్ మండల కేంద్రం లో అంబేద్కర్ విగ్రహం ఎదుట సిపిఐ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సమితి సభ్యులు పేరాల శ్రీనివాసరావు మాట్లాడుతూ బ్రిటిష్ కాలంనాటి గవర్నర్ వ్యవస్థ వలన ప్రభుత్వాలని వారి ఇష్టం వచ్చినట్టుగా ఆడించే విధంగా, కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా చేస్తూ కీలుబొమ్మలాగా వ్యవస్థ మారిందని, కావున ఈ వ్యవస్థను రద్దుచేసి ఫెడరల్ వ్యవస్థను కొనసాగించాలని, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శిలు పాండవుల బిక్షం, సిద్ధార్థ సుబ్బారెడ్డి, బాలకృష్ణ, అఖిలభారత యువజన సమాఖ్య జిల్లా నాయకులు జహీర్, మహిళా సంఘం నాయకురాలు గౌస్యా బేగం, మల్సూర్ శివ, వెంకటేశ్వర రెడ్డి తదతరులు పాల్గోన్నారు.