చంటి క్రాంతి కిరణ్ మంత్రి కావాలి
లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బీసీ సంఘం అధ్యక్షులు గొల్ల కృష్ణ మూర్తి
రేగోడ్ //జనం సాక్షి// డిసెంబర్:
అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మంత్రి కావాలని కోరుతూ మండల కేంద్రమైన రేగోడు కు చెందిన బీసీ సంఘం అధ్యక్షులు గొల్ల కృష్ణమూర్తి గురువారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. కాగా నూతన మంత్రివర్గ విస్తీర్ణత జరిపి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే కాంత్ కిరణ్ అన్నకు మంత్రి పదవిని వర్తింపజేయాలన్నారు. కాగా మెట్లపై నుంచి కాలినడకన దర్శనానికి వెళ్లినట్లు తెలిపారు. వీరి వెంట మాజీ పి ఎస్ సీస్ చైర్మన్ రాధా కిషన్ గుప్తా, టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, రాయచోటి సుభాష్ లు ఉన్నారు.
చంటి క్రాంతి కిరణ్ మంత్రి కావాలి




