Thursday, 5 November 2026

గాంధారిలో నాడు నేడు అభివృద్ధి.. నెరవేరిన గాంధారి ప్రజల చిరకాల స్వప్నం.

గాంధారి జూన్ జనంసాక్షికామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో 10 కోట్లతో నూతనంగా చేపట్టిన రోడ్డుతో పలు వెడల్పు పనులు ఇటీవల పూర్తి కావడంపై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేపట్టారు గతంలో మండల కేంద్రంలోని ప్రధాన రోడ్లుతో పాటు ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురికి నీరు రోడ్లపై ప్రవహించేది చిన్నపాటి వర్షానికి రోడ్లపై వర్షపు నీరు ప్రమాదకరంగా రోడ్లు ఎక్కడున్నాయో గుంతలు ఎక్కడున్నాయో తెలియని స్థితిలో ఉండేవి ప్రయాణికులకు తీవ్ర ఆంతర్యం కలిగేది మండల రహదారుల విషయం ఎమ్మెల్యే దృష్టికి అధికారులు తీసుకెళ్లగా వెంటనే స్పందించి రూ.. 10 కోట్లు మంజూరు చేయించారు మండల కేంద్రంలోని వాగుపై నుంచి సబ్ స్టేషన్ వరకు నూతనంగా బీటీ రోడ్డును చేపట్టడంతో పాటు రోడ్డును ఇరువైపులా 50 ఫీట్లు పెంచారు( ప్రజా సమస్యలపై పోరాడుతా ఎమ్మెల్యే)మండల ప్రజలకు ఎన్నో ఏండ్లు నుంచి కలగా ఉన్న డబుల్ రోడ్డు పనులను రూ.10 కోట్లతో పూర్తి చేశా నియోజకవర్గ ప్రజలకు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా గాంధారి మండల ప్రజలకు ఎన్నో ఏళ్ల నుంచి కలగా ఉన్న రోడ్డు నెరవేరుస్తా అనే సంకల్పంతో గతంలో ఎప్పుడు జరగని అభివృద్ధి నాలుగు సంవత్సరాల్లో జరిగింది ప్రతి గ్రామంలో ఇప్పటివరకు 60 లక్షల నుంచి కోటి రూపాయల వరకు అభివృద్ధి పనులు చేపట్టాం

(నేడు గాంధారి రూపు రేఖలు)

గాంధారిలో ప్రధాన రహదారి రోడ్డు వెడల్పు పనులతో పాటు డివైడర్ ఇరువైపులా డ్రైనేజీలు నిర్మించడంతో గాంధారి రూపురేఖలు మారాయి త్వరలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు

(సంతోషం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు)

మా మండల కేంద్రానికి ఇంత మంచి సౌకర్యవంతమైన రోడ్డు వస్తుందని మేము కలలో కూడా అనుకోలేము మొక్కలు నాటేలా డివైడర్ ఇరువైపులా మురికి కాలువల నిర్మాణ పనులను ఎమ్మెల్యే జాజాల సురేందర్ రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు జాజాల సురేందర్ గాంధారి మండల ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మండల కేంద్రంలోని ప్రధాన రోడ్డు పనులపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తి చేయించారు పనులు సకాలంలో పూర్తి కావడంపై మండల ప్రజలు అటు బాన్సువాడ కామారెడ్డికి ఈ రోడ్డు గుండానే వెళ్లే ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు