మల్కాజిగిరి.జనంసాక్షి.జూన్12.క్రీడలు ఆరోగ్యానికి శరీర ధారుఢ్యానికి దోహదపడతాయని ఎంపీ ధర్మపురి అరవింద్,సినిమా హీరో మంచు మనోజ్ పేర్కొన్నారు.ఆదివారం బీజేవైఎం జాతీయ కోశాధికారి సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టీం సాయి స్పోర్ట్స్ ఉత్సవ్ మల్కాజిగిరి లోని లక్ష్మీ సాయి గార్డెన్ పక్కన క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించారు.
ఈకార్యక్రమానికి వారు ముఖ్యఅతిథిగా హాజరై వాలీబాల్ పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.క్రీడలకు కులమతాలతో సంబంధం లేదని కుల మతాలకు అతీతంగా అందరూ క్రీడలలో పాల్గొనవచ్చని అన్నారు.నేటి యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు.నిర్వాహకులు సాయి ప్రసాద్ మాట్లాడుతూ.42 లక్షల ప్రైజ్ మనీతో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని నాలుగు వారాల పాటు నిర్వహించిన ఈ వారం జరిగిన వాలీబాల్ పోటీలలో 28 టీంలు పాల్గొనగా సుభాష్ నగర్ టీం విజేతగా నిలిచిందని అన్నారు. విజేతలకు ప్రైజ్ మనీ తో పాటు బహుమతులు అందజేశామని తెలిపారు. ఫుట్ బాల్,బాస్కెట్ బాల్,బ్యాట్మెంటన్, స్నూకర్ తదితర క్రీడా పోటీలను ప్రతి శని ఆదివారాలలో నాలుగు వారాలపాటు నిర్వహిస్తామని ఆసక్తి ఉన్న యువతీ యువకులు పేరు నమోదు చేసుకొని పాల్గొనవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శ్రావణ్ కుమార్,రాజ్యలక్ష్మి,సునీత శేఖర్ యాదవ్,జీకే హనుమంతరావు,వీకే మహేష్,గోపు రమణారెడ్డి ఆర్కే శ్రీనివాస్,సదానంద గౌడ్,ప్రసన్న నాయుడు,వాసంశెట్టి శ్రీనివాస్,మధుసూదన్ రెడ్డి,చందు, భరత్,రాకేష్,మణిరత్నం,గణేష్ తదితరులు పాల్గొన్నారు.
చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి.




