Thursday, 5 November 2026

పోలేపల్లి రామ్ నగర్ గట్టు పీర్ల దర్గ ఉర్సు ఉత్సవం లో పాల్గొన్న పిసిసి నాయకులు కేతావత్ భీల్యా నాయక్

కొండమల్లేపల్లి జనవరి 22 (జనంసాక్షి) న్యూస్ : చింతపల్లి మండలం పొలేపల్లి రాంనగర్ గ్రామంలో ఆదివారం నాడు గట్టు పీర్ల దర్గ ఉర్సు ఉత్సవంలో భాగంగా టిపిసిసి నాయకులు కేతావత్ బీల్యా నాయక్ గట్టు పీర్ల దర్గాలో చాదర్ పూలమాలలు సమర్పించి మొక్కును తీర్చుకున్నారు ఈ సందర్భంగా గట్టు పీర్ల దర్గా కమిటీ సభ్యులు కేతావత్ బీల్యా నాయక్ ను పూల మాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు అనంతరం బీల్యా నాయక్ మాట్లాడుతూ ఈ గట్టు పీర్ల దర్గా కు ఎంతో ప్రాముఖ్యత ఉందని గట్టు పీర్ల దర్గాను రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు పాల్గొంటారని తెలిపారు కుల మతాల కు అతీతంగా దర్గా ను భక్తులు సందర్శిస్తారు అన్నారు మరియు అల్లాహ్ ఆశీస్సులతో ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మెలగాలని అన్నదాతలు ఆనంద పడే విధంగా పంటలు బాగా పండాలని ఆ అల్లాహ్ ను మొక్కు కున్నానని తెలిపారు తనను ఘనంగా సన్మానించిన గట్టు పీర్ల దర్గా కమిటీ సభ్యులందరికీ ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియజేశారు మరియు గట్టు పీర్ల దర్గాకు హాజరైన భక్తుల కోసం బీల్యా నాయక్ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అనంతరం భక్తులకు భోజనం వడ్డించారు కేతావత్ బీల్యా నాయక్ శిష్యుడు జైపాల్ నాయక్ గట్టు పీర్ల దర్గా ఉర్సులో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి దర్గాలో చాదర్ పూలమాలలు సమర్పించి వెండి గొడుగు బహుకరించారని తెలిపారు ఈ కార్యక్రమంలో గట్టు పీర్ల దర్గా ముజావర్లు ముహమ్మద్ నిరంజన్ ముహమ్మద్ జహంగీర్ దర్గా ఇన్చార్జి పడగంటి జంగయ్య స్థానిక ఎంపీటీసీ సునిత వసంత్ నాయక్, మాజీ ఎంపీటీసీ మునుకుంట్ల శేఖర్ గౌడ్, దోంతగొని శేఖర్ గౌడ్,యువజన కాంగ్రెస్ నాయకులు కిరణ్ నాయక్, గడిగ లింగం గౌడ్, జైపాల్ నాయక్,మొతిలాల్,మహెందర్, ఇమ్రాన్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు