Tuesday, 3 November 2026

జాతిపితమహాత్మా గాంధీ వర్ధంతి సందర్బంగా ఘన నివాళులు అర్పించిన టిపిసిసనాయకులు కేతావత్ భీల్యా నాయక్

 

 

 

 

 

 

 

కొండమల్లేపల్లి జనవరి 30 (జనంసాక్షి) న్యూస్ :
చింతపల్లి మండల పరిధిలో గల వెంకటేశ్వర నగర్ లొ సొమవారం నాడు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా దేవరకొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేతావత్ భీల్యా నాయక్ గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీల్యా నాయక్ మాట్లాడుతూ భారత దేశ స్వాతంత్య్రం ఉద్యమం లో గాంధీజీ ప్రముఖ పాత్ర వహించారన్నారు మరియు మహాత్మా గాంధీజీ గొప్ప తన్నాని కొనాయాడారు.ఈ కార్యక్రమంలో దెవరు కొండ మాజి శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్, మండల పార్టీ అధ్యక్షులు నాగ భూషణం,ఎంపీపీ పవన్ భవాని కుమార్, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు వూరే లక్ష్మన్,మాజిఎంపీపీ, రవి నాయక్,మాజి మండలం అధ్యక్షుడు గొవన్నా, పిఎసిఎస్ చైర్మన్ ఆలంపల్లి వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సంజీవరెడ్డి,పురుషొత్తం రెడ్డి, నర్సిరెడ్డి, చింతపల్లి మండల ఇంచార్జీ నాయిని మాధవరెడ్డి, అంగిరేకుల గొపాల్,చెక్కల కృష్ణయ్య ఎండీ ఖలిల్, ఇమ్రాన్, మరియు రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ, స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు,యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు