హైదరాబాద్ః తెలంగాణలో సైన్ఫ్లూ మరణాలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి మృతి చెందింది. నల్గొండ జిల్లాకు చెందిన గర్భిణి రెండు రోజులుగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వ్యాధి తీవ్రం కావడంతో ఆమె ఈ ఉదయం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో ఇప్పటి వరకు సైన్ఫ్లూతో 34 మంది మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సైన్ఫ్లూతో ఇక్కడ మరో 30 మంది రోగులు చికిత్స పొందుతున్నారు.




