Wednesday, 4 November 2026

గాంధీ ఐడియాలోజి కేంద్రంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం…. – పాల్గొన్న టిపిసిసి మెంబర్ సున్నం నాగమణి

గాంధీ ఐడియాలోజి కేంద్రంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం….
– పాల్గొన్న టిపిసిసి మెంబర్ సున్నం నాగమణి

అశ్వరావుపేట ఆర్సి జనవరి 5 (జనంసాక్షి )
అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి జడ్పిటిసి మరియు కాంగ్రెస్ పార్టీ టిపిసిసి సభ్యులు సున్నం. నాగమణి సికింద్రాబాద్ బోయినపల్లి లోని గాంధీ కేంద్రంలో ఒక్కరోజు శిక్షణ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సదస్సులో కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎంపీ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క లు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ధరణి లోపాలు హత్ సే హాత్ భారత్ జోడోయాత్ర కార్యక్రమం ఎన్నికల నిబంధనలు ఎన్నికల నియమావళి మీడియా రిలేషన్స్ మెంబర్షిప్ ఇన్సూరెన్స్ తదితర అంశాలపై ఈ శిక్షణ కార్యక్రమంలో చెప్పటం జరిగిందన్నారు అంతేకాకుండా దేశ రాష్ట్ర జిల్లా ల వారీగా పార్టీ విధానాలను అనుసరించవలసిన వాటి గురించి కూలంకుషంగా చర్చించినట్లు ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డి సి సి అధ్యక్ష కార్యదర్శులు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు