Wednesday, 4 November 2026

తెలంగాణ సెంట్రింగ్ మేస్త్రి యూనియన్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి రమేష్

తెలంగాణ సెంట్రింగ్ మేస్త్రి యూనియన్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి రమేష్

జనంసాక్షి ,హసన్ పర్తి:గ్రేటర్ వరంగల్ 46వ డివిజన్ గోపాల్ పూర్ లో తెలంగాణ సెంట్రింగ్ మేస్త్రి యూనియన్ నూతన కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా యూనియన్ నాయకులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సిరంగి సునీల్, జక్కుల రజిత వెంకటేశ్వర్లు, గుగులోత్ దివ్యారాణి రాజు నాయక్, సెంట్రింగ్ మేస్త్రి యూనియన్ నాయకులు, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.