జుక్కల్, ఎప్రిల్ 06, (జనం సాక్షి),కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలోని పెద్ద కొ డప్ గల్ మండలం వడ్లం గ్రామంలో నిర్వహిస్తున్నఅఖండ హరినామ సప్తహా లో భాగంగా గురువారం జరిపిన గాథ పూజలో జుక్కల్ ఎమ్మెల్ల్యే హాన్మంత్ షిండే పాల్గొన్నారు. గ్రంధాలకు భక్తిశ్రద్దలతో పూజలుచేశారు. గ్రంథాలను నూతన వస్త్రాలలో కట్టినారు.అఖండ హరినామ సప్తాహా కార్యక్రమంలో ప్రతిరోజు భజనలు, కీర్తనలు, ప్రవచనాలు, హారతి నిర్వహించారు. అన్నదానం చేశారు.గ్రామం పాడీ పంటలతో,పిల్లా పాపలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని సప్టాహా నిర్వహించినట్లు ప్రజలు తెలిపారు.గాతపూజలో ఎమ్మెల్ల్యేతో పాటు శ్యామ్ పటేల్, సంజీవ్ పటేల్, మల్లుగొండ దంపతులు, గ్రామప్రజలు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




