Wednesday, 4 November 2026

రెడ్ క్రాస్ సొసైటీ  ఆద్వర్యంలో కోలంగూడ నిరుపేద లకు వంట సామగ్రి పంపిణి

 

 

 

 

 

 

 

గతంలో ఇచ్చిన మాట ప్రకారం గురువారం రోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆద్వర్యంలో మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని మారుమూర ప్రాంతంలో నివసిస్తున్న కోలంగూడ నిరుపేద కుటుంబాలకు  వంట సామగ్రి పంపిణీ చేయడం జరిగినది.ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి  మాట్లాడుతూ గత నెలలో కోలంగూడ నివాసులకు  బ్లాంకెట్స్ మరియు హైజినిక్ కిట్లు అందించడం జరిగింది అలాగే వారికి ఆరోజు ఇచ్చిన హామీ ప్రకారం,  ఈరోజు వంట సామగ్రి కూడా అందించడం జరిగినది ఇలాగే మునుముందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా ఆద్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలతో  అందిస్తామని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి ,  వైస్ చైర్మన్ చందూరి మహేందర్ , జిల్లా కోశాధికారి పడాల రవీందర్ , జిల్లా కమిటీ సభ్యులు కాసర్ల శ్రీనివాస్ , రెడ్ క్రాస్ సొసైటీ జీవితకాల సభ్యుడు కాసర్ల రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.