మునిపల్లి, ఏప్రిల్ 06, జనంసాక్షి : యావత్ జాతి వీరత్వానికి ప్రతీకగా నిలిచిన శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేయడం గర్వంగా ఉందని ఎంపీటీసీ రేణుకా వెంకటేశం అన్నారు. మునిపల్లి మండలంలోని పెద్దలోడి గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన చేసేందుకు భూమి పూజ చేశారు. విగ్రహ ఏర్పాటు కోసం రూ.50 వేలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చిట్కుల వెంకటేశం మాట్లాడుతూ శివాజీ మహారాజ్ ధైర్య సాహసాలతో ధర్మాన్ని కాపాడేవారని గుర్తు చేశారు. శివాజీ స్పూర్తితో యువకులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. శివాజీ మహారాజ్ భూమి పూజ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు మొగులయ్య, యూత్ అధ్యక్షులు నరేష్, బీఆర్ఎస్ నాయకులు అశోక్ పటేల్, వీరేశం, సంఘం కృష్ణ, గంగారి వీరేశం, చిటుకుల శ్రవణ్, తూర్పు సురేష్ యాదవ్, జనార్దన్, తూర్పు సైహైన్న తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.




