Thursday, 5 November 2026

బోనకల్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో వృద్ధ శ్రమలో ఫుడ్స్ పంపిణీ

బోనకల్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో వృద్ధ శ్రమలో ఫుడ్స్ పంపిణీ

బోనకల్,జనంసాక్షి
బోనకల్ జనసేన పార్టీ మండల నాయకులు లక్కి శెట్టి సాయికుమార్ ఆధ్వర్యంలో బోనకల్ వృధాశ్రమంలో ఫ్రూట్స్ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా తాళ్లూరు డేవిడ్ తో పాటు లక్కీ శెట్టి సాయికుమార్ మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవ అని చెప్పేసి మా అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే సిద్ధాంతాలు మాకు నేర్పించారో అదేవిధంగా ప్రజా సమస్యల పైన పోరాడుతూ సమస్య ఎక్కడుందో అక్కడే మనం ఉండాలని ప్రతినిత్యం ప్రజా సమస్యల మీద పోరాడాలని మధిర నియోజకవర్గంలో జన సైనికులు గ్రామ గ్రామాన పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ప్రకారంగా సేవ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఆశలు అనుగుణంగా ముందుకెళ్తామని రాబోయే రోజుల్లో గ్రామ గ్రామాన పార్టీ కార్యక్రమాలు నిర్వహించి పార్టీ బలోపేతం కావడానికి మధిర నియోజకవర్గ జనసైనికులు అందరు సిద్ధంగా ఉన్నారని 2024 జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని సీఎం చూడటమే మా ధ్యేయమని మధిర నియోజకవర్గ జనసేన అడ్డగ మారుస్తామని మధిర నియోజకవర్గo మధిర గడ్డమీద జనసేన జెండాను ఎగరేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మధిర నియోజకవర్గ నాయకులు తాళ్లూరి డేవిడ్ నరసింశెట్టి నరేష్ మండల నాయకులు పవన్ అద్దంకి సంతోష్ కుమార్ మచ్చ మనోజ్ మోదుగు తరుణ్ మోదుగు చంటి దుర్గాప్రసాద్ తరుణ్ తదితరులు పాల్గొన్నారు.