Wednesday, 4 November 2026

గాలి దుమారం తో టెంట్లు కాస్త కూలిపోయాయి.

జనం సాక్షి/ కొల్చారం మండలం పోతన శెట్టిపల్లి రైతు వేదిక ను తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా తీర్చిదిద్దారు. నేడు ఉదయం రైతు వేదిక ఆవరణలో రైతు దినోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద పెద్ద షామియానాలు ఏర్పాటు చేయడంతో నేడు ఒక్కసారిగా గాలి దుమారం తో టెంట్లు కాస్త కూలిపోయాయి. ఉదయం నుండి రైతు వేదిక వద్ద గ్రామ పంచాయతీ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం నుండి రైతు వేదిక ఆవరణలో ఆటపాట తోపాటు ప్రత్యేక భోజనంలో ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు