బచ్చన్నపేట జూన్ 2(జనం సాక్షి)తెలంగాణ ప్రభుత్వం భాష సాంస్కృతిక శాఖ మరియు పెరల్స్ ఆర్ట్ క్రియేషన్స్ సిద్దిపేట వారి సంయుక్త ఆధ్వర్యంలో బోనాల కోలాటం శిక్షణ శిబిరం శుక్రవారం రోజున జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో పశువుల అంగడి పెద్దమ్మ దేవాలయం వద్ద ప్రారంభమైంది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి , గ్రామ ఎంపీటీసీలు నల్లగోని పుష్ప బాలకిషన్, అలువాల రాధా ఎల్లయ్యలు పెద్దమ్మ దేవాలయంలో పూజలు చేసి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శిక్షణ శిబిరానికి ప్రధాన శిక్షకులుగా సుందరి సుంకరి శరత్. సుంకరి శిక్షకులుగా ఏదుల మహేశ్వరి . బడికే కవిత. ఘటం స్వామి ఉన్నారు ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట ఆలింపురం మరియు ఆలేరు మండలం టంగుటూరు గ్రామాల మహిళలు శిక్షణ తీసుకుంటున్నారు .
శిక్షణ సమయంలో అందరికీ ఉచితంగా మంచినీటిని, బచ్చన్నపేట గ్రామ మహిళలకు ఉచితంగా చీరలు ఇస్తానని బచ్చన్నపేట సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి అన్నారు. మహిళలందరికీ కోలలు ఉచితంగా అందిస్తారని ఎంపిటిసి పుష్ప బాలకిషన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ జంగిడి సిద్ధులు, ఏనుగుల కనకయ్య ,సోమల్ల రాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నుండి 15 రోజుల వరకు ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు




