Wednesday, 4 November 2026

గిరిజనులు ఆర్ధికంగా ఎదగాలి రీజనల్ జనరల్ మేనేజర్ ఉషా పీ టీ

 

 

 

 

 

 

 

మహా ముత్తారం మే 10 (జనం సాక్షి) మారుమూల ప్రాంతంలో పేద నిరుపేద గిరిజనులు నాబార్డు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుకొని ఆర్ధికంగా ఎదగాలని నాబార్డు తెలంగాణ రీజనల్ జనరల్ మేనేజర్ ఉషా పీ.టీ అన్నారు. బుధవారం మహముత్తారం మండలం లోని బోర్లగూడెం గ్రామంలో సమగ్ర గిరిజన అభివృద్ధి పథకం ( మా తోట) పథకాన్ని నాబార్డు ఆర్ధిక సహకారంతో షార్ప్ సంస్థ ఆధ్వర్యంలో రీజనల్ రీజనల్ జెంటిల్ మేనేజర్ ఉషా పీ టీ ప్రారంభించారు.ఈ సందర్భంగా జీవనోపాధి కింద ఒకరికి కిరాణ షాప్, మరొకరికి మేకలు అందజేశారు. అనంతరం రైతు వేదికలో నిర్వహించిన సమావేశం లో రీజనల్ జనరల్ మేనేజర్ ఉషా పీ టీ మాట్లాడుతూ ఈ పథకాన్ని విజయవంతం గా ముందుకు మీ గ్రామంలో తీసుకెళ్లాలని, దీనికి మీ అందరి సహకారం ఉండాలని రైతులకు సూచించారు. మీ అందరికి షార్ప్ సంస్థ ఎల్లవేళలా సహాయ సహకారాలు ఎంతగానో అందిస్తుందిని వారు సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ భాస్కర్,జిలా ఉద్యానవన అధికారి సంజీవ రావు మాట్లాడుతూ పండ్ల తోటలతో పాటు పామాయిల్ తోటల పెంచుకోవాలని సూచించారు. అలాగే వాతావరణ నిర్ధారణ పథకంలో భాగంగా పండిస్తున్న కూరగాయల ప్రదర్శనను సందర్శించారు. ఈ కార్యక్రమంలో నాబార్డు ఎజీఎం ఎల్ చంద్రశేఖర్, డిడిఎం రవి చైతన్య, ఎల్డ్ డి ఎం తిరుపతి, జెడ్పీటీసీ లింగ మల్లశారద, రేగుల గూ డెం సర్పంచ్ దేవేందర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి సతీష్, ఏఈఓ ఆస్మా, డీహెచ్ఓ రమేశ్, మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్శ్రీ శ్రీనివాస్, షార్ప్ సీఈఓ కూరెళ్ల నర్సింహా చారి, సిబ్బంది పోలోజు నర్సింహా చారి, పల్ల గొర్ల యాదగిరి, రాజేశ్, వన సమాఖ్య ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాస్, టిడిఎఫ్ అధ్యక్షుడు మహేశ్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.