గిరిజనుల సంక్షేమంకోసం..  కిడారి పోరాడారు

– ఏజెన్సీ అభివృద్ధికి ఎంతో తపనపడేవారు
– బాక్సైట్‌కు, కిడారి హత్యకు ఎలాంటి సంబంధం లేదు
– కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటాం
– ఆయనకు ఇప్పటికీ సొంత ఇల్లు లేదు
– కుమారుడికి గ్రూప్‌-1 ఉద్యోగం ఇస్తాం
– కిడారి కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు
– కుమారులను ఓదారుస్తూ కంటతడి పెట్టుకున్నసీఎం!
– సోమ కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు
– కుటుంబానికి అండగా నిలుస్తామని హావిూ
విశాఖపట్టణం, సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ) : గిరిజనుల అభివృద్ధి కోసం దివంగత నేత కిడారి సర్వేశ్వరరావు ఎంతో కృషి చేశారని, నిధుల కోసం తనవద్ద పట్టుబట్టి మంజూరు చేయించుకొని ఏజెన్సీని అభివృద్ధి పర్చేందుకు శాయశక్తులా కృషి చేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. అమెరికా నుంచి నేరుగా చేరుకున్నాక  శుక్రవారం ఉదయం విశాఖ జిల్లా పారేడుకు బయలుదేరి వెళ్లారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాననీ, భయపడవద్దని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా సర్వేశ్వరరావు కుమారులు సందీప్‌, శ్రవణ్‌ లను ఒదార్చిన చంద్రబాబు ఓ దశలో తాను కన్నీళ్లు పెట్టుకున్నారు. విూ కుటుంబానికి అండగా నేనుంటా ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు. అనంతరం  చంద్రబాబు సర్వేశ్వరరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. కిడారి ఎప్పుడూ అభివృద్ధి గురించే మాట్లాడేవాడని తెలిపారు. ఆయన ఇద్దరు కుమారులను తాను ఇప్పుడే చూస్తున్నానని వెల్లడించారు. అలాంటి అంకిత భావం ఉన్న నేతను కోల్పోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రజాసేవకు వెళ్లిన కిడారిని మావోలు హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను చంపితే ప్రజలకే నష్టమనీ, దీనివల్ల ఎలాంటి లాభం జరగదని వ్యాఖ్యానించారు. పాడేరు, అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కిడారి కుటుంబానికి
ప్రభుత్వం తరఫున రూ.కోటి నగదు సాయంతో పాటు ఓ కుమారుడికి గ్రూప్‌-1 ఉద్యోగం ఇస్తామని తెలిపారు. అలాగే పార్టీ తరఫున రూ.15 లక్షల సాయం అందిస్తామన్నారు. కిడారి కుటుంబానికి సొంత ఇల్లు లేదనీ, ఇంకా ప్రభుత్వ క్వార్టర్లలోనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి వైజాగ్‌ లో ఇంటి స్థలం కేటాయిస్తామన్నారు. ఈ సందర్భంగా పాడేరు టికెట్‌ ను ఎవరికి ఇస్తారని విూడియా ప్రశ్నించగా.. ఇప్పుడు దానిపై మాట్లాడటం సరైనది కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా కిడారి సర్వేశ్వరరావు అనుచరులు, టీడీపీ కార్యకర్తలు జో¬ర్‌ కిడారి సర్వేశ్వరావు జోహార్‌, అమర్‌ రహే కిడారి సర్వేశ్వరరావు అమర్‌ రహే అంటూ ఆ ప్రాంతమంతా దద్ధరిల్లేలా నినాదాలు చేశారు.
సివేరి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటాం – సీఎం
కిడారి కుటుంబాన్ని ఓదార్చిన చంద్రబాబు అనంతరం అరకులో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత సివేరి సోమ కుటుంబాన్ని పరామర్శించారు. సివేరి కుమారుడిని హక్కున చేరుకొని ఓదార్చారు. అనంతరం సివేరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాబు మాట్లాడుతూ.. సివేరి సోమ పార్టీ కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. పార్టీ అభివృద్ధి, ఏజెన్సీలో పార్టీని బలోపేతానికి తీవ్రవంగా శ్రమించారని అన్నారు. సోమ కుటుంబానికి అన్ని విధాల ప్రభుత్వ పరంగా, పార్టీ రంగా అండగా ఉంటామని, వారిని అన్ని విధాల ఆదుకుంటామని చెప్పారు. గిరిజనుల అభివృద్ధికోసం కృషిచేసే వారిని చంపడం ద్వారా గిరిజనులకే నష్టం ఉంటుందని, కిడారి, సోమలాంటి ప్రజాప్రతినిధులను కాపాడుకోవాల్సిన బాధ్యత గిరిజనులపై ఉంటుందన్నారు.

తాజావార్తలు