గిరిజనుల సమస్యలు పరిష్కరించడం లో ప్రభుత్వం విఫలం
జహీరాబాద్ డిసెంబర్ 10 (జనంసాక్షి )గిరిజనుల సమస్యలు పరిష్కరించడం లో ప్రభుత్వం విఫలమైందని బిఎస్పీ నాయకులు సిద్దు రావణ్ అన్నారు.శనివారంజహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోన మొడంపల్లి మండలంలోని పలు తాండాలను సందర్శించారు. ఈ సందర్భంగా సిద్దు రావణ్ మాట్లాడుతూ తండాల సమస్యలకు పరిష్కారం కావాలి అంటే యువత బహుజన్ సమాజ్ పార్టీ ని బలోపేతం చేయడం అవసరం అని అన్నారు. బహుజన రాజ్యం సాధించుకోవడం కోసం ప్రతి బడుగు బలహీనవర్గాల వారు కలిసి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గిరిజన జన సమితి రాష్ట్ర అధ్యక్షులు వినోద్ నాయక్, బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్చార్జి బి. బాబురావు, కిషన్ నాయక్, జుబేర్, మహమ్మద్ మోబిన్, యాదగిరి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు
గిరిజనుల సమస్యలు పరిష్కరించడం లో ప్రభుత్వం విఫలం




