Wednesday, 4 November 2026

పంట సాగు వివరాలు నమోదు చేసుకోవాలి

పంట సాగు వివరాలు నమోదు చేసుకోవాలి

జహీరాబాద్ డిసెంబర్ 10 (జన సాక్షి ) యాసంగీ లో సాగు చేసిన శనగ, సాయి జొన్న, తెల్ల కుసుమ, చిరు శనగ, అవిషలు, గోదుమ, వాము, ఉద్యాన పంటలైన ఆలు గడ్డ, పుచ్చకాయ, బొప్పాయి, ఉల్లిగడ్డ, అరటి, కూరగాయల పంటల వివరాలు తప్పకుండ వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని జాహీరాబాద్ వ్యవసాయ విస్తరణ అధికారి ప్రదీప్ కుమార్ తెలిపారు. శనివారం మండల పరిధి రంజోల్ లో రైతులతో కలిసి క్షేత్ర సందర్శన చేసి సాగు వివరాలు అంతర్జాలం లో నమోదు చేశారు ఈ వివరాల ప్రకారమే ఎ గ్రామంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు అనే వివరాలు తెలుస్తాయని దీని ప్రకారమే ప్రభుత్వం పంట కొనుగోలు కు ఏర్పాటు చేసి అన్ లైన్ లో ఉన్న రైతుల పంట ఉత్పాదక శనగ, జొన్న, మొదలగు పంటలు కొనుగోలు చేస్తుంది కావున రైతు లు అందరు మీ వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలి అన్నారు. ఈ క్షేత్ర సందర్శన లో వ్యవసాయ విస్తరణ అధికారి ప్రదీప్ కుమార్ తో పాటు రంజోల్ గ్రామ రైతు బందు సమితి ఆద్యక్షులు కమ్మరి భాస్కర్ చారి, కొత్త నారాయణ రెడ్డి, మానెయ్య, ఫిరోజ్, తుక్కరెడ్డి, ఏసప్ప తదితరులు ఉన్నారు.