Tuesday, 3 November 2026

గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కల్చరల్ ఫెస్ట్ 2023.

నెరడిగొండ మార్చి11(జనంసాక్షి):
గిరిజన విద్యార్థులల్లో దాగి ఉన్న వివిధ రకాల కళా ప్రతిభాను వెలికితీసే విదంగా మంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని మండల ఎంపీపీ రాథోడ్ సజన్ అన్నారు.శనివారం రోజున
మండలంలోని లఖంపూర్ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలల్లో నిర్వహించిన స్కూల్ డే స్టార్స్ కల్చరల్ ఫెస్ట్ 2023 ప్రోగ్రాం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి మండల ఎంపీపీ రాథోడ్ సజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.జ్యోతి ప్రజ్వలన చేసినంతరం ఎంపీపీ కి ఘనసన్మానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల నృత్యాలు చాలా ఆకట్టుకున్నాయి పండుగ వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో కల్చరల్ ఆక్టివిటీస్ స్పోర్ట్స్ లో కూడా ముందుండాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను రూపుదిద్దుతున్నారన్నారు. నృత్య ప్రదర్శనాలు జానపద పాటలు చిత్ర లేఖనం క్విజ్ వ్యాసరచన పోటీలు మాక్ పార్లమెంట్ మిమిక్రీ వంటి మంచి కార్యక్రమాల వల్ల విద్యార్థులు మరింత ఉత్సాహం చూపించి చదువులోను ఆటల్లోనూ పాటల్లోనూ ముందుండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోపాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాద్యాయుల బృందం విద్యార్థినులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.