Wednesday, 4 November 2026

గిరిజన ఉపాధ్యాయులకు ఎన్ ఓ సి ఇప్పించిన ఘనత ఎమ్మెల్సీ నర్సిరెడ్డి దే

గిరిజన ఉపాధ్యాయులకు ఎన్ ఓ సి ఇప్పించిన ఘనత ఎమ్మెల్సీ నర్సిరెడ్డి దే
* టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు భూక్య కిషోర్ సింగ్

టేకులపల్లి, జనవరి 9( జనం సాక్షి): గిరిజన ఉపాధ్యాయులకు ఎన్ ఓ సి ఇప్పించిన ఘనత ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కే దక్కుతుందని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు భూక్య కిషోర్ సింగ్ అన్నారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమశాఖ లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న గిరిజన ఉపాధ్యాయులు ఇన్ సర్వీసులో బిఈడి, బి పి డి ( B. ed, B. ped ) చేయుటకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 342 ను విడుదల చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా గిరిజన సంక్షేమశాఖ లో ఉపాధ్యాయులు ఇన్సెర్విస్ లో ఉన్నత విద్యా చదువుతూనే ఉన్నారు. అందుకు గాను భద్రాచలం ఐ టి డి ఏ పరిధిలో గిరిజన సంక్షేమశాఖ లో ఎస్ జి టి గా విధులు నిర్వహిస్తు ఉన్నత చదువుల కోసం గత నాలుగు నెలల క్రితం నిరభ్యంతర పత్రము ఎన్ ఓ సి కొరకు ఐ టి డి ఏ డిప్యూటీ డైరెక్టర్ వారి కార్యాలయం లో మొత్తం 36 మంది ఉపాధ్యాయులు ప్రాతినిధ్యం చేసిఉన్నారు. ప్రాజెక్టు అధికారి ఆంద్ర ప్రాంతంలోని కళాశాలలో చేరిన వారికి ఎన్ ఓ సి ఇవ్వబోమని, తెలంగాణ రాష్ట్రం లోని కళాశాలలో చేరిన వారికి మాత్రమే ఇస్తామని చెప్పడంతో అభ్యర్థులు అందరూ కూడా కొంత మొత్తమును నష్టపోయి తెలంగాణ కళాశాలలో చేరినారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావుని కలిసి టీఎస్ యుటిఎఫ్ జిల్లా కమిటీ ప్రాతినిధ్యం చేయడం,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పలు మార్లు ఐ టి డి ఏ పి ఓ భద్రాచలం వారితో మాట్లాడి ,ఉపాధ్యాయులు ఉన్నత చదువులు పూర్తి చేయక పోతే వారు ప్రమోషన్స్ లో నష్టపోతారని ,ఇన్ సర్వీసులో బీఈడీ, బిపిడి చదవడం గిరిజన సంక్షేమశాఖ ఉపాధ్యాయుల హక్కు అని వివరించడం ద్వారా పిఓ సోమవారం నిరభ్యంతర పత్రం ఇవ్వడం జరిగింది అని తెలిపారు. ఈ సందర్బంగా ఐటీడీ