100 ఓట్ల సర్వే చేస్తున్న GWMC 66వ డివిజన్ సీనియర్ నాయకులు 26వ బూత్ ఇంచార్జ్ కందుకూరి సాయి చందు
జనంసాక్షి, హసన్ పర్తి, జనవరి 9: వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆరూరి రమేష్ మరియు GWMC 66వ డివిజన్ BRS పార్టీ అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్
ఆదేశాల మేరకు ఆత్మకూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వీసం సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హాసన్ పర్తి 66వ డివిజన్ పరిధిలో 100ఓట్ల ఇన్చార్జులుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తన బూత్ లో 100ఓట్ల భాధ్యత తీసుకొని ఇంటింటికీ సర్వే చేస్తున్న బీఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు 26వ బూత్ 100 ఓట్ల ఇంచార్జ్ కందుకూరి సాయి చందు , 26వ బూత్ సభ్యుల ఇంటింటికి తిరుగుతూ సమస్యలు తెలుసుకుని సంబంధిత 66వ డివిజన్ అధ్యక్షుడికి సమాచారం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పోతరాజు ప్రభాకర్,66వ డివిజన్ యూత్ అధ్యక్షులు వల్లాల శ్రీకాంత్,ఉపాధ్యక్షులు ఆకుల ప్రభాకర్ తదితరులున్నారు.
100 ఓట్ల సర్వే చేస్తున్న GWMC 66వ డివిజన్ సీనియర్ నాయకులు 26వ బూత్ ఇంచార్జ్ కందుకూరి సాయి చందు




