Wednesday, 4 November 2026

గిరిజన గ్రామాల రోడ్డు సమస్యలను పరిష్కరించండి

:

 

 

 

 

– తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావు.ఇంద్రవెల్లి : ఫిబ్రవరి 10( జనం సాక్షి)ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ గిరిజన గ్రామాల రోడ్డు సమస్యలను వెంటనే పరిష్కరించాలని తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని వడగావ్ గ్రామపంచాయతీ పరిధిలోని జెండాగూడా గ్రామంలో ఆదివాసీ సంఘాల నాయకులతో కలసి పర్యటించారు. గ్రామస్తులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ… గ్రామం ఏర్పడి ఏళ్ళు గడుస్తున్నా సమస్యల పరిష్కారం కావడం లేదని అన్నారు. అధికారులు,ప్రజా ప్రతినిధులు స్పందించి తమ గ్రామ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. తదనంతరం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావు మాట్లాడారు. ఏళ్ళు గడుస్తున్న ఆదివాసీ గిరిజన గ్రామీణ ప్రాంతాలలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు అధికారంలో వచ్చి వెళ్ళి పోయాయని కానీ ఆదివాసీల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. ఆదివాసీల సంక్షేమం కోసం ఏర్పడిన ఐటిడిఎ సైతం సమస్యలను పరిష్కరించడం లేదని అన్నారు. వెంటనే జెండాగూడా గ్రామానికి బిడ్జి నిర్మాణం చేపట్టి, రోడ్డు మంజూరు చేయాలని కోరారు. ఇటీవల సరైన రోడ్డు మార్గం లేక దారి మధ్యలో మరణించిన విద్యార్థికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారం కానీ యెడల ఉద్యమ బాటపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ గోవింద్ రావ్,ఎంపీటీసీ మధుకర్,తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు భారత్,విద్యార్థి సంఘం మండల అధ్యక్షుడు పుర్క చిత్రు, ముఖాడే ఉత్తం, భగవంతరావ్, రాధాబాయి,కల్యాణి,లక్ష్మి, పోచుబాయి, భీంరావ్, బాపురావ్,జంగు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.