మెట్ పల్లి టౌన్, ఫిబ్రవరి 10,జనంసాక్షి :తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భాష పండితులు పి ఈ టీ లు గత 25సంవత్సరాలు నుండి ప్రమోషన్ కు నోచుకోక శ్రమ దోపిడీకి గురి అవుతున్నారని, రాష్ట్ర పండిత పి ఈ టి, జేఏసి పిలుపు మేరకు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్ లో గురువారం నుండి నల్ల బ్యాడ్జి లతో విధులకు హాజరు అవుతున్నారు జాబ్ చార్ట్ ప్రకారం 6,7,8, తరగతులు మాత్రమే బోధిస్తామని 9,10తరగతుల సహాయ నిరాకరణ ఫిబ్రవరి 1వ తారీఖు నుండి నేటికీ 9వ రోజు కొనసాగుతున్నదని, ప్రభుత్వం వెంటనే పండితులకు పిఈటీ లకు ఈ షెడ్యూల్ లలో నే పదోన్నతి లు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమం లో రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ టీ ఎస్ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు అల్లకట్టు సత్యనారాయణ, ఏనుగందుల రాజేంద్ర ప్రసాద్ ,పిఈటీ ల జిల్లా అధ్యక్షులు సుంచు అశోక్,పడాల విశ్వ ప్రసాద్,శ్రీకాంత్,వెంకటేశ్వర్లు, అందుర్తి స్వామి తెలుగు, హిందీ, ఉర్దూ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు




