సైదాపూర్ జనం సాక్షి ఫిబ్రవరి 10; మండలంలోని లస్మన్న పల్లి గ్రామానికి చెందిన వెన్నంపల్లి సింగిల్ విండో డైరెక్టర్ మ్యాకల తిరుపతిరెడ్డి ఇటీవల మృతి చెందగా ఆయన కుటుంబాన్ని మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుమారులైన ఉపసర్పంచ్ మ్యాకల మల్లారెడ్డి, జగన్నాథరెడ్డి లను ఓదార్చారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి సంతాపం ప్రకటించారు. విండో డైరెక్టర్ గానే కాకుండా మ్యాకల తిరుపతిరెడ్డి వెన్నం పెల్లి ఉమ్మడి గ్రామపంచాయతీ పరిధిలో ఏ ఇంటిలో మరణించిన, వారి కుటుంబానికి నేనున్నానంటూ దగ్గరుండి అంత్యక్రియలు జరిపించే వారని గుర్తుచేశారు. వంద శవాల కూ పైగా మోసిన ఘనత తిరుపతిరెడ్డి కె దక్కిందన్నారు. పెద్దిరెడ్డి వెంట స్థానిక ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి ,సింగిల్ విండో అధ్యక్షులు బిల్ల వెంకట్రెడ్డి, సర్పంచ్ కాయిత రాములు, టిఆర్ఎస్ నాయకులు మ్యాకల రవీందర్ రెడ్డి, మ్యాకల మల్లారెడ్డి, సారబుడ్ల శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.




