గిరిజన నాయకుడు భూక్యా నామ నాయక్ గారి దిశ దశ కార్యక్రమానికి పాల్గొన్న ఎంపిపి బోడ మంగీలాల్ నాయక్.
ఖమ్మం జిల్లా.( అక్టోబర్ 27) జనం సాక్షి . తిరుమలాయపాలెం: మండల పరిధిలోని హైదర్ సాయిపేట గ్రామానికి చెందిన *గిరిజన నాయకుడు భూక్యా నామ నాయక్ గారి దిశ దశ కార్యక్రమానికీ ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్ పాల్గొనీ వారీకీ ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్ మాట్లాడుతు నామ నాయక్ గారు సామాజిక సేవ కర్తగా, గిరిజన అభివృద్ధి కోసం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపును పోందారనీ,గ్రామంలో అందరితో కలిసి మెలిసి ఉండేవారని, వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. నామ నాయక్ గారి కుటుంబ సభ్యులకు అండదండగా ఉంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో హైదరసాయిపేట సర్పంచ్ మట్ట కరుణ శ్రీ, టీఆర్యస్ గ్రామ నాయకులు బణోత్ చీమ్లా,గుగులోత్ హరి కిషన్,భూక్యా పాండు నాయాక్,బాణోత్ భిక్యా నాయక్,శంకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు




