Friday, 6 November 2026

నరేంద్ర మోడీ అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన తెరాస నాయకులు

నరేంద్ర మోడీ అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన తెరాస నాయకులు.
400 కోట్లతో నలుగురు తెరాస ఎమ్మెల్యే లను ప్రలోభపెట్టాలని చూసిన బీజేపీ నీచ రాజకీయాలను ఖండిస్తూ
వీణవంక అక్టోబర్ 27 (జనం సాక్షి)వీణవంక మండల కేంద్రంలో తెరాస ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చెయ్యడం జరిగింది ట్రస్మా నియోజవర్గ అధ్యక్షులు మూసిపట్ల తిరుపతిరెడ్డి మండల సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రఘుపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వం లో దేశ రాజకీయాల్లోనే ఎన్నో మార్పులు రాబోతున్నాది అనేది నిజం. తెలంగాణ ఆత్మగౌరవం ముందు డబ్బులు ఓడిపోయానని బిజెపి నిరంకాషాన్ని తెలంగాణ ఆత్మగౌరవం అడ్డుకుందని అన్నారు. కెసిఆర్ రాజకీయా చతురతను తట్టుకోవడం సాధ్యం కాకనే బిజెపి పార్టీ కుటిల రాజకీయం చేస్తూ తెరాస ఎమ్మెల్యే లను ప్రలోభ పెట్టడానికి కుట్ర చేసిందని మండల నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ సింగిల్ చైర్మన్ గంగాడి తిరుపతిరెడ్డి. మోరే సారయ్య. అడిగొప్పుల సత్యనారాయణ. కామెడీ శ్రీనివాస్ రెడ్డి. బొబ్బుల సమ్మిరెడ్డి తోపాటు సర్పంచులు ఎంపీటీసీలు తెరాస నాయకులు కార్యకర్తలు ఉన్నారు.