Wednesday, 4 November 2026

గిరిజన మత్స్య సహకార సంఘాలకు వృత్తి నైపుణ్యతా పరీక్షలు

 

 

 

 

 

ఏటూరునాగారం (జనం సాక్షి),ఏప్రిల్ 25.ఈరోజు మండలం స్పెషల్ డ్రైవ్ రెండులో భాగంగా ఈ రోజు ఐదు ప్రతిపాదిత గిరిజన మత్స్యపారిశ్రామిక సహకార సంఘంములకు వృత్తి నైపుణ్యత ప్రవేశ పరీక్షలు ఏటూరు నాగారం మండలం.శాపెల్లి పెద్ద చెరువు నందు మొత్తం డెభై ఏడూ మంది సభ్యులకు వృత్తి నైపుణ్యతా  పరీక్షలు నిర్వహించనైనది.1.అల్లం వారి ఘన్ పూర్, 2. కొండా యి, 3.రాంపూర్ అగ్రహార్, 4.చల్పాక, 5.శాపల్లి కి చెందిన ప్రతిపాదిత  గిరిజన మత్స్యకారులు పాల్గొన్నారు.
ఈ కార్య క్రమములో జిల్లా మత్స్యశాఖ అధికారి పి.శ్రీపతి, పేసా కోఆర్డినేటర్కొమురం ప్రభాకర్, ఎఫ్.ఎఫ్. వో. పాముల రమేష్, మత్స్యశాఖ సిబ్బంది భూక్యా కృష్ణ, అయా సంఘాల సర్పంచులు పాల్గొన్నారు.