హైదరాబాద్,మే9(జనం సాక్షి): రెక్కాడితే కాని డొక్కాడని గిరిజన మహిళ జ్యోతి అనారోగ్య పరిస్థితిని తెలుసుకొని నిజామాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత చలించిపోయారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఊట్పల్లి గ్రామానికి చెందిన జ్యోతి.. అక్యూట్ ఇంటెస్టయినల్ అబ్ స్టక్షన్ర్ వ్యాధితో బాధపడుతోంది. ఆమె ఏమి తిన్నా, ఆఖరుకు గ్లాసుడు మంచి నీళ్ళు తాగినా పొట్ట అసాధారణముగా ఉబ్బుతుంది. దీంతో కూర్చోలేదు.. నడవలేదు.. రాత్రిళ్ళు సరిగా నిద్రపట్టదు.. అయాసంతో ప్రాణాలు తోడేసే వ్యాధిని నయం చేయించుకునేందుకు దాదాపు ఆరు నెలలు పాటు నిజామాబాద్ లోని అందరూ డాక్టర్లను కలిసింది. చివరికి సికిందారాబాద్ లోని సన్ ్గ/న్ ఆసుపత్రిలో జ్యోతి చేరింది. రూ. 3-4 లక్షలు ఖర్చవుతాయని డాక్టర్లు చెప్పడంతో జ్యోతి సోదరుడు విజయ్ తన చెల్లెలి పరిస్థితిని ఎంపి కవితకు ట్విట్టర్ ద్వారా వివరించారు. స్పందించిన కవిత విజయ్ కు కాల్ చేసి అధైర్య పడవద్దని చెప్పారు. ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి ఆపరేషన్ చేయించారు. నిన్నచేసిన ఆపరేషన్ విజయవంతం అయ్యిందని డాక్టర్లు తెలిపారు. దీంతో తన సోదరికి వైద్యం చేయించిన ఎంపి కవితకు విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. సర్జరీ విజయవంతమైందని కవితకు విజయ్ ట్వీట్ చేశారు.
—–
గిరిజన మహిళ ఆరోగ్యానికి ఎంపి కవిత సాయం




