Thursday, 5 November 2026

నాగం జనార్దన్‌రెడ్డికి మాతృవియోగం


హైదరాబాద్‌,మే9(జ‌నం సాక్షి):  మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి తల్లి నారాయణమ్మ(95) బుధవారం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పంజాగుట్టలోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమెకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం స్మశానవాటికలో సాయంత్రం 4:30 గంటలకు ఆమెకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో పంజాగుట్టలోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.  నారాయణమ్మ మృతిపై పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. నాగంకు పలువురు సంతాపం తెలిపారు.