Friday, 6 November 2026

గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి — టి పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిలాల్ నాయక్

గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
— టి పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిలాల్ నాయక్

టేకులపల్లి, అక్టోబర్ 27 (జనం సాక్షి ): గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, అదనపు పని భారాన్ని తగ్గించాలని టి పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు హరిలాల్ నాయక్ కోరారు. గిరిజన సంక్షేమ శాఖ, ఐటిడిఏ భద్రాచలంలో చాలాకాలంగా సమస్యలు అపరిస్కృతంగా పాఠశాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 29న చలో ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ గురువారం టి.పి.టి.ఎఫ్ ఆధ్వర్యంలో గంగారం ఆశ్రమం ఉన్నత పాఠశాలలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లా టి పి టి ఎఫ్ ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్
గిరిజన సంక్షేమ శాఖ,ఐటీడీఏ భద్రాచలంలో చాలాకాలంగా అపరిస్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల, పాఠశాలల సమస్యలన్నింటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 29న ఐటీడీఏ భద్రాచలం కార్యాలయం ముందు జరిగే నిరసన కార్యక్రమానికి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలనికోరారు. టి.పి.టి.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్ కోరారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఈరోజు ఆశ్రమ ఉన్నత పాఠశాల గంగారంలో మధ్యాహ్నం నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడుతూ,గిరిజన సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని,అదనపు పని భారాన్ని తగ్గించాలని అనేకసార్లు ఐటిడిఏ భద్రాచలం పి.ఓ గారికి మరియు కమిషనర్ గిరిజన సంక్షేమ శాఖ హైదరాబాద్ గారికి ప్రాతినిధ్యాల