వరంగల్ ఈస్ట్, జూన్ 30 (జనం సాక్షి)ప్రమాదవశాత్తు నందికుంట తాటి వనంలో తాటి చెట్టు మీద నుంచి కింద పడిపోయి గాయాల పాలైన వరంగల్ నగరంలోని రంగసాయిపేటకు చెందిన గీత కార్మికుడు గీసగోని మోహన్ కు శుక్రవారం ఎక్సైజ్ శాఖ నుంచి వచ్చిన రూపాయలు ఐదు లక్షల చెక్కును ఎక్సైజ్ సీఐ చంద్రమోహన్ ద్వారా అందించారు. తాటి చెట్టు మీద నుంచి పడి జీవనోపాధి కోల్పోయిన మోహన్ ను ఆదుకోవడం కోసం ప్రభుత్వం ద్వారా 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందేలా చేసిన వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నప్పునేని నరేందర్, మాజీ కార్పొరేటర్ కెడల పద్మ జనార్ధన్, కిల వరంగల్ పిఎసిఎస్ చైర్మన్ కేడాల జనార్ధన్, కల్లుగీత సొసైటీ చైర్మన్ మండ వెంకన్న, రంగసాయిపేట గీత కార్మిక డైరెక్టర్ పాలకుర్తి శ్రీనివాస్, విలసాగరం సతీష్, విలాసాగరం భాస్కర్, విలసాగరం సుధాకర్, పాలకుర్తి సుమన్ లకు గీసగోని మోహన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి రవీందర్ కత్తి ఎల్ల గౌడ్ విలాసాగరం చిన్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గీత కార్మికుడు మోహన్ కు 5లక్షల ఆర్థిక సాయం




