
గద్వాల నడిగడ్డ,, జూన్ 30 (జనం సాక్షి);జోగుళాంబ గద్వాల జిల్లా లో నేడు శనివారం టి ఎస్ పి ఎస్ సి గ్రూప్-IV ప్రిలిమినరీ రాత పరీక్ష జరిగే 49 కేంద్రాలలో దగ్గర 144సెక్షన్ అమల్లో ఉంటుందని,పరీక్ష కేంద్రాలను 13 రూట్లలో ఏర్పాటు చేసి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా 200 మంది ఫోర్స్ తో పకడ్బందీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ కె. సృజన* తెలిపారు.జిల్లా లోని గద్వాల టౌన్-20, ఐజ-7, శాంతి నగర్-5, ఆలంపూర్-4, ఎర్రవల్లి-5 పట్టణాలతో పాటు దరూర్-2, ఆలంపూర్ X రోడ్-3, ఇటిక్యాల-2, మల్డకల్-1 లలో 49 పరిక్ష కేంద్రాలలో 14 వేల 920 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు.
పరీక్ష కేంద్రాలలో శనివారము ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6:00 గం: వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందనీ, పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్, ఇంటర్ నెట్ సెంటర్స్, చుట్టుపక్కల లౌడ్ స్పీకర్లు, మూసి వేయాలని, పరీక్ష సెంటర్స్ వద్ద నుండి 100 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దు అని, పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అభ్యర్థులును ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ పరీక్షా సమయానికి 1:00 గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని, మానసికంగా ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని జిల్లా ఎస్పీ సూచించారు. పరీక్షల సమయాలు పేపర్- 1 ఉదయం 10:00 నుండి మద్యాహ్నం 12:30 గంటల వరకు,, పేపర్- 2 మధ్యాహ్నం 2: 30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నిర్వహించబడుతుందనీ,పరీక్షా కేంద్రంలో అభ్యర్థులకు బయోమెట్రిక్ మాదిరిగా ఫింగర్ ప్రింట్ తీసుకోవడం జరుగుతుందనీ, అభ్యర్థుల ఫోటో గుర్తింపు కార్డు ఉంటేనే అనుమతి, పరీక్షకు 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల గేట్లు మూసి వేయబడుతాయి. ఉదయం పేపర్-1 పరీక్ష రాసేవారు సమయం 9:45, పేపర్-2 పరీక్ష రాసేవారు 2:15 గంటల తర్వాత పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబడదు.డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ లో ఉన్న నిబంధనలు అభ్యర్థులు చదువుకొని వాటిని పాటించాలని సూచించారు.
చివరి నిమిషంలో వచ్చి ఇబ్బంది పడకుండా సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అభ్యర్థులకు సూచించారు. పరీక్షా కేంద్రంలోకి బ్యాగులు, సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, వాచ్లు, క్యాలిక్యులేటర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరు. చెప్పులు మాత్రమే వేసుకొని రావాలి. షూ వేసుకుని పరీక్షా కేంద్రానికి రావద్దు.అభ్యర్థులను మెటల్ డిటెక్టర్ ద్వార పరిశీలించి పరీక్షా కేంద్రంలోనికి పంపించడం జరుగుతుంది అభ్యర్థులు తమ వెంట పరీక్ష హాల్ టికేట్, మరియు బ్లూ, బ్లాక్, బాల్ పెన్స్ మాత్రమే తీసుకురావాలని జిల్లా ఎస్పీ సూచించారు.




