జనం సాక్షి /కొల్చారం మండలం రంగంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే సమయపాలన పాటించకపోవడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 9:30 కల్లా పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల లో నలుగురు ఉపాధ్యాయులు మాత్రమే హాజరయ్యారు మరో ఇద్దరు 10:30 దాటిన పాఠశాల కి రాకపోవడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల చుట్టూ శుభ్రంగా ఉంచాల్సిన అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో చెత్తా చెదారంతో పాటు నిర్మాణ వ్యర్ధాలను అక్కడే వేయడంతో పాఠశాల దుర్గంధంగా మారింది ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల చుట్టూ శుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
సార్.. మేము వచ్చాము.. మీరెక్కడా… *ఉపాధ్యాయుల ఆలస్యంతో ఆరుబయటే విద్యార్థుల ఎదురుచూపులు *కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ…




