హైదరాబాద్: ఇవాళ ఉదయం గుంటూరు,ప్రకాశం జిల్లాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత ఉదయం 6గంటల సమయంలో రిక్టర్ స్కేల్ పై 4గా నమోదైంది. ప్రకాశం జిల్లాలోని ఒంగోలుకు సమీపంలో 60-70 కిలోమీటర్ల పరిధిలో భూకంప కేంద్రం అధీకృతమైనట్టు నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ) అధికారులు తెలిపారు. ఐదు పెకన్ల పాటు భూకంపం సంభవించిందని..దీని వల్ల ఎలాంటి నష్టం జరుగలేదని పేర్కొన్నారు.




