Tuesday, 3 November 2026

గుంటూరు ఆసుపత్రి ఎదుట అఖిలపక్షం ఆందోళన

హైదరాబాద్ :గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించేందుకు మంత్రులు పీతల సుజాత, కామినేని, ఎంపీ గల్లా జయదేవ్‌ వచ్చారు. అదే సమయంలో ఆసుపత్రి బయట అఖిలపక్షం నేతలు ఆందోళనకు దిగారు. ఎలుకల దాడిలో బాలుడు చనిపోయిన ఘటనపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోనికి వెళ్లేందుకు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకొని…మంత్రులు, ఎంపీని ఆసుపత్రిలోనికి పంపించారు. ఘటనపై మంత్రి కామినేని సీరియస్ అయ్యారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *