గుండన్నపల్లిలో ముగ్గుల పోటీలు ..
బోయిన్ పల్లి జనవరి 14 (జనం)రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి సాక్షి గుండన్న పల్లి గ్రామంలో సర్పంచ్ కొప్పుల లక్ష్మీ సామి ఆధ్వర్యంలో శనివారం రోజు ముగ్గుల పోటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బోయినపల్లి ఎస్ ఐ అభిలాష్ హాజరైన ముగ్గుల పోటి లో పాల్గొన్న మహిళలకు బహుమతులు. మహిళలకు ఎంతో ఉత్సాహం కల్పించే ముగ్గుల పోటీలు సంక్రాంతి సందర్భంగా వన్నెతెచ్చే విధంగా ముగ్గులు మహిళలు వేశారని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప డైరెక్టర్ సర్పంచ్ ఐలయ్య, సెస్ సుధాకర్, ఎంపిటిసి ఉపేందర్, బిఆర్ఎస్ నాయకులు మెడుదుల మల్లేశం, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, మహిళలు ఉన్నారు. 
గుండన్నపల్లిలో ముగ్గుల పోటీలు




