స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.
– బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్.
బెల్లంపల్లి, జనవరి 14, (జనంసాక్షి )
స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్ అన్నారు. శనివారం అయన మండలంలోని బట్వాన్ పల్లి గ్రామంలో రత్నం వసంత కు పీఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా మంజూరైన పిండి గిర్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం ఉపాధి పథకాల ఆర్థికంగా వృద్ధి చెందాలని, ఐకేపీ ద్వారా స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేసి స్వయం ఉపాధి పథకాలు అందించడం వల్ల జీవన ప్రమాణాలు మెరుగు పడుతాయని అన్నారు. ఈకార్యక్రమంలో ఐకేపీ సీసీ సుందరేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.




