గుండారంలో పౌర హక్కుల దినోత్సవం

జనంసాక్షి, కమాన్ పూర్ : రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., (డిఐజి) ఆదేశాల మేరకు కమాన్ పూర్ ఎస్ఐ బేతి రాములు ఆధ్వర్యంలో రెవిన్యూ శాఖ సిబ్బంది తో కలిసి గురువారం గుండారం గ్రామంలో పౌర హక్కుల దినం ను నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్ఐ రాములు మాట్లాడుతూ… అంటరానితనం ,అన్యాయాలను, మోసాలను ,వివక్షతను ఎదిరించేదే పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమం అనాదిగా వస్తున్నది అని అంటరానితనాన్ని రూపుమాపడానికి , దళితుల హక్కులు తెలియజేయడానికి, గ్రామంలో ప్రతి ఒక్కరు సోదర భావంతో మెలగడానికి, దళితులపై జరుగుతున్న అత్యాచారాలను, మోసాలు, దాడులను అరికట్టడానికి ఉద్దేశించిందని, కావున దళితులు మరియు దళితుల తమ యొక్క హక్కులు, వాటి అమలు తెలుసుకొని , అందరితో కలిసి మెలిసి ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో గుండారం సర్పంచ్ ఆకుల ఓదెలు, ఉప సర్పంచ్ చంద్రమౌళి, గిరిదవారి సందాని తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు