Wednesday, 4 November 2026

గుండెగా0 తాత్కాలిక పునరావాసవాసుల రాస్తారోకో..

డేలోనే కాదు..!నైట్ లో కూడా ధర్నాలు..!

.

డబల్ బెడ్రూంలలో కరెంటు లేక నాలుగు రోజులుగా ఇబ్బంది…

రోడ్డెక్కిన బాధితులు…

భైంసా రూరల్ జనవరి 23 జనం సాక్షి

నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని గుండెగాం గ్రామం పేరు ప్రతిసారి సమస్యలు ఉన్నాయంటూ వింటూనే ఉన్నాం. ప్రతి వర్షాకాలంలో పళ్సీకర్ రంగారావు ప్రాజెక్టు వరద నీటికి ముంపుకు గురవుతుంది. ప్రభుత్వం తాత్కాలిక నివాసాల నిమిత్తం బైంసా- గుండెగా౦ రహదారిలో నిర్మించినటువంటి నూతన్ డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో తాత్కాలిక నివాసనాలు ఏర్పరచుకొని ఉండగా అంతా బాగానే సాగుతోంది. గత నాలుగు రోజులు క్రితం విద్యుత్ సంబంధిత అధికారులు కరెంట్ బిల్లు చెల్లించడం లేదంటూ డబల్ బెడ్ రూమ్ లపై కరెంట్ బిల్లులు పెండింగ్ ఉన్నాయ0టూ విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.దీంతో కరెంటు లేక తాత్కాలిక నివాసకులు ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఎవరికి చెప్పిన సమస్య తీరడం లేదంటూ విసుగు చెందిన బాధితులు సోమవారం రాత్రికి రాస్తారోకో దిగి తమ నిరసనను వ్యక్తం చేశారు విద్యుత్ అధికారులు రావాలి విద్యుత్ సరఫరా అందించాలంటూ ధర్నా చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయిపోయి వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.పిల్లాపాపలతో నివాసం ఉంటున్న మాకు ఇబ్బంది కరెంటు లేక ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని బాధితులు పేర్కొంటున్నారు.