Wednesday, 4 November 2026

నాగోబా సన్నిధిలో భక్తుల సందడి

…
ఇంద్రవెల్లి జనవరి 23 (జనం సాక్షి)
ఇంద్రవేల్లి : రాష్ట్ర పండుగగా పేరు పోందిన, ఆదివాసీల ఆరాధ్యదైవంగా కొలిచే కెస్లాపూర్ నాగోబా జాతర మూడో రోజు సోమవారం భక్తులతో కిటకిటలాడింది. జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో కేస్లాపూర్ జనసంద్రాన్ని తలపించింది.

పెర్సాపేన్, భాన్ పేన్ దేవతలకు ప్రత్యేక పూజలు

మెస్రం వంశీయులు ఆధ్వర్యంలో నాగోబా ఆలయం వెనుక భాన్‌దేవత, పెర్సాపేన్ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తగా భేటింగ్ (పరిచయం) అయిన కోడళ్లు మర్రిచెట్టు వద్ద పురాతన కోనేరు నుంచి నీటిని తీసుకొచ్చి మట్టిగోలలను తయారు చేసి భాన్ దేవతలుగా పూజించారు. అనంతరం ఆదివాసీ గిరిజనుల సంప్రదాయ వాయిద్యాలు డోల్, పెప్రే, సన్నాయి, కాలికోమ్ వాయిస్తూ మెస్రం వంశీయులు పీఠాధిపతి మెస్రం పటేళ్లు వెంకట్‌రావ్, చిన్ను పటేల్, బాదిరావ్ పటేల్ ఆధ్వర్యంలో కటోడ హనుమంతు రావ్, మెస్రం కోసేరావు లు పెర్సాపేన్ (పెద్దదేవుడు)కు వారి సంప్రదాయ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నైవేద్యాలు సమర్పించి సహపంక్తి భోజనాలు చేశారు.