Thursday, 5 November 2026

పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలి

 

 

 

 

 

 

:శామీర్ పేట్, జనం సాక్షి :వివిధ గ్రామాల్లో పెండింగ్ లో ఉన్న జీతాలు తక్షణమే చెల్లించాలని శామీర్ పేట్ లోని కలెక్టరేట్ కార్యాలయంలో మేడ్చల్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారికి తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా పలువురు ఐఎఫ్ టీయూ నాయకులు మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా గ్రామ పంచాయతీల్లో పారిశుద్య కార్మికులకు రావాల్సిన 3 నెలల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిదంగా జీవో నంబర్ 60 ప్రకారం కార్మికులకు వేతనాలు అమలు చేయాలన్నారు. జీవో నంబర్ 51ని సవరించడంతో పాటు మల్టీపర్పస్ విదానాన్ని రద్దు చేయాలన్నారు. పారిశుద్య కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలనే పలు డిమాండ్లతో డీపీఓకి వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్వామి, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, బాలనర్సింహా, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
6ఎస్పీటీ -2: డి పి ఓ కు వినతి పత్రం అంద జేస్తున్న