ఇటిక్యాల (జనంసాక్షి) ఫిబ్రవరి 6 :మండల పరిధిలోని కొండేరు గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పోతురాజు బలరాముడు వయస్సు 48 గత కొంతకాలం నుంచి కిడ్నీ సమస్యతో భాదపడుతున్న అయన రాత్రి భోజనం చేసిన తర్వాత ప్రమాదవశాత్తు గుండెపోటు రావడంతో హుటాహుటిన ప్రైవేటు వాహనం ద్వారా కర్నూలు తరలిస్తుండగా మార్గమధ్య కోదండపురం స్టేజి దగ్గర మృతి చందగా మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. అయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ తెలంగాణ రాష్ట్ర ఢిల్లీలో ప్రత్యేక అధికార ప్రతినిధి డాక్టర్ మంద జగన్నాథం, అలంపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు మంద శ్రీనాథ్, వడ్డేపల్లి శ్రీనివాసులు, మంద వెంకట కుమార్, మాజీ ఎంపిటిసి నారాయణ నాయుడు, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఎస్. ఎ సంపత్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి, ఎర్రవల్లి గోపి, ఎర్రవల్లి సర్పంచ్ జోగుల రవి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు గ్రామానికి చేరుకొని బలరాముడు మృతిదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా మంద శ్రీనాథ్ మాట్లాడుతూ బలరాముడు మృతి బిఆర్ఎస్ పార్టీకి తీరనిలోటని భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబంలో ఒక సభ్యుడిని కోల్పోయిననని తీవ్రవిచారం వ్యక్తం చేశారు. ఇంటి పెద్దది కొనుక్కోల్పోవడంపై కుటుంబ సభ్యులు కన్నీరు మున్నారయ్యారు.




