Thursday, 5 November 2026

గుండెపోటుతో లారీ క్లీనర్ మృతి

గుండెపోటుతో లారీ క్లీనర్ మృతి..

జూలూరుపాడు డిసెంబర్ 5, జనంసాక్షి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని పత్తి కొనుగోలు కేంద్రం వద్ద సోమవారం గుండెపోటుతో లారీ క్లీనర్ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతి చెందిన లారీ క్లీనర్ ముచ్చి పాపయ్య అని, మృతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మచిలీపట్నం ప్రాంతానికి చెందిన వాసిగా గుర్తించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.