రానున్న ఎన్నికల్లో పోటీలో ఉంటా…!
మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్
భైంసా రూరల్ డిసెంబర్ 05 జనం సాక్షి
రానున్న ఏన్నికల్లో ముధోల్ నియోజక వర్గ పరిధి నుంచి పోటీ చేయనున్నట్లు ముధోల్ మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణ్రావుపటేల్ పేర్కొన్నారు. సోమవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను రెండు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచి ముధోల్ నియోజక వర్గ అభివృధ్దికి శాయా శక్తుల కృషి చేసానన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికి అధికార పార్టీ సహాకారంతో ప్రగతి కోసం అహర్నిషలు పాటు పడ్డానన్నారు. గతంలో కాంగ్రెస్ అధిష్టానం సూచించిన మేరకు 2014లో జరిగిన ఎన్నికల్లో ముధోల్ ఎమ్మెల్యేగా విఠల్ రెడ్డి గెలుపు కోసం కృషి చేశానని, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ విషయంలో మోసం చేసిందన్నారు. ఈ కారణంగానే ఎన్సీపీ అభ్యర్థిగా ముధోల్ నియోజక వర్గ బరిలో నిలిచినట్లుగా పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రేస్ తో పాటి కొన్ని పార్టీలు తనను వారి పార్టీల్లో చేరాల్సిందిగా ఆహ్వనించాయన్నారు . అయితే సెక్యూలర్ భావజాలాలు గల తాను బీజేపీలో చేరబోనని స్పష్టం చేశారు. టికెట్ విషయంలో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీతోను జతగట్టబోనన్నారు. తన అభిమానులు, అనుచర వర్గం, కార్యకర్తల అభిప్రాయం సేకరించిన అనంతరం ఏ పార్టీలో చేరాలన్నది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్సీపీ పార్టీకి రాజీనామ చేసి అధిష్టానానికి పంపినట్లుగా స్పష్టం చేశారు. త్వరలోనే నియోజక వర్గ పరిధిలోని అనుచరులు, అభిమానులు, కార్యకర్తలతో ప్రత్యేక బేఠీలు నిర్వహించి వారందరి సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకొని రాజకీయ భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానన్నారు. ఎలాంటి పరిస్థతితుల్లోను వచ్చే ఎన్నికల్లో పోటీలో నిలుస్తానని ప్రకటించారు. విలేకరుల సమావేశంలో కుంటాల మాజీ ఎంపీపీ సయ్యాజీ భోజారాంపాటిల్ మాజీ మున్సిపల్ షేక్ మీరా, పీఏసీఎస్ మాజీ చైర్మన్ శ్యాంరావుపటేల్, దళిత సంఘాల ప్రతనిధి శంకర్చంద్రే, న్యాయవాధి డబ్ల్యూ భీంరావులతో పాటు పలువురు మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీలు, సమావేశంలో పాల్గొన్నా




